పవర్ స్టార్ విశ్వరూపం.. అదిరిపోయిన 'పవర్ గ్లాన్స్' (వీడియో)

by GSrikanth |   (  Updated:2025-08-26 17:01:11  IST  )

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి 'పవర్ గ్లేన్స్' విడుదల చేశారు.

పవర్ స్టార్ విశ్వరూపం.. అదిరిపోయిన పవర్ గ్లాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రం నుంచి 'పవర్ గ్లాన్స్' విడుదల చేశారు. ''మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని, తొడకొట్టాడో.. తెలుగోడు.'' అనే క్యాప్షన్‌తో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 'గ్లాన్స్' విడుదల చేశారు. ఇంతవరకు ఎవరూ చూడని గెటప్‌లో పవన్ కల్యాణ్‌ను చూపిస్తూ అదరగొట్టారు. కండలు తిరిగి ఉన్న మళ్ల యోధులను మట్టి కరిపిస్తున్న పవన్ కల్యాణ్, ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు. పవర్ ఫుల్ లుక్‌లో ఫ్యాన్స్‌కు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. కాగా, ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Click For Video ....

Also Read :

షూటింగ్‌లో గాయపడిన టాలీవుడ్ హీరో

Next Story