తమన్నా భాటియాకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు వైరల్.. ఎందుకంటే?

by Disha Web Desk 6 |
తమన్నా భాటియాకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు వైరల్.. ఎందుకంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరంలో శ్రీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత హ్యాపీడేస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్ వంటి స్టార్స్‌తో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. గత కొద్ది రోజుల నుంచి తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరీ బోల్డ్‌గా నటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి.

వీటిపై స్పందించిన తమన్నా అతనితో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశ్వంభర, ఓదెలా-2 వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తమన్నాకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే.. ఈ మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన పోస్ట్ నెట్టింట హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ పోస్టును చూసిన తమన్నా.. ‘‘ థాంక్యూ కాజు ఇన్ని సంవత్సరాల నుంచి నాకెంతో సపోర్ట్‌గా నిలిచావు. హద్దులు లేని ప్రేమను పంచావు. నీ లాంటి స్నేహితురాలు ఉండటం వల్ల నా కెరీర్ హాయిగా కొనసాగుతోంది. ఫ్యాన్స్ ఉత్సాహం నాకు రెట్టింపు శక్తినిస్తాయి. మీ అందరికీ నచ్చే చిత్రాలను అందిస్తానని హామీ ఇస్తున్నాను’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed