గుడ్ న్యూస్ చెప్పిన నటి.. ఆ ప్రకటనతో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నటి పూర్ణ(poorna) సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్-2’(Jailer-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గుడ్ న్యూస్ చెప్పిన నటి.. ఆ ప్రకటనతో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పూర్ణ(poorna) సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్-2’(Jailer-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. పూర్ణ పర్సనల్ లైఫ్ పరంగా గత కొద్ది రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె భర్త ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈక్రమంలోనే అంతా ఆందోళన చెందుతుండగా.. పూర్ణ భర్త షానిద్ అసిఫ్(Shahid Asif) మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ విషయంపై పూర్ణ స్పందించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, పూర్ణ గుడ్ న్యూస్ ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే ఓ బాబు ఉన్న పూర్ణ ఇప్పుడు తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా కుటుంబంలోకి మరొకరు రాబోతున్నాను. మనం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవించడం అనే కల నా జీవితంలో నిజమైంది. కానీ తల్లిదండ్రులు కావడం అన్నింటికంటే అందమైన అధ్యాయం. మేము మా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నాం. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల కోసం మేము వేచి ఉండలేము. కొత్త నవ్వులు, చిన్ని అడుగుజాడలు మా జీవితాల్లోకి రానున్నాయి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన మొదటి బిడ్డ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ సర్‌ప్రైజ్‌ను అస్సలు ఊహించలేదని అంటున్నారు.

Next Story