Pooja Hegde: టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన పూజా హెగ్డే.. స్టార్ హీరో సినిమాలో చాన్స్!

by Hamsa |   ( Updated:2024-12-06 13:28:11.0  )
Pooja Hegde: టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన పూజా హెగ్డే.. స్టార్ హీరో సినిమాలో చాన్స్!
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్(Prabhas), మహేష్ బాబు, రామ్ చరణ్(Ram Charan) వంటి స్టార్స్ సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ బుట్టబొమ్మగా అందరి హృదయాలను కొల్లగొట్టింది. కానీ మూడేళ్ల నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిందని ఓ వార్త వైరల్ అవుతోంది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సరసన చాన్స్ అందుకున్నట్లు టాక్. అయితే ‘సర్కార్ వారి పాట’ మూవీకి వర్క్ చేసి రవి(Ravi) ఈ చిత్రంతో మెగా ఫోన్ పట్టబోతున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 11న స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎస్‌ఎల్వీ సినిమా బ్యానర్‌పై రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed