- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan సినిమాకు నో చెప్పిన Pooja Hegde..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. రాజకీయాలలో గ్యాప్ దొరికినప్పుడే సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారని ఆ చిత్రాలు ఎప్పుటికి పూర్తవుతాయన్న అయోమయ స్థితిలో డైరెక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయినా కానీ, కొత్త చిత్రాలు ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల హరిష్ శంకర్ దర్శకత్వంలో 'భవధీయుడు భగత్ సింగ్' మూవీని పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ప్రకటించారు. తాజాగా, ఈ సినిమాకు పూజ హెగ్డే నో చెప్పినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ నటిస్తున్నారు. కాబట్టి వీలున్నప్పుడే షూటింగ్‌లకు రావడం వల్ల తన డేట్స్ మారుతాయని, అందువల్ల ఇబ్బంది అవుతుందనే కారణంతోనే పూజ నో చెప్పినట్లు సమాచారం.
Read More...
Salman Khan, Pooja Hegde డేటింగ్.. సిగ్గుందా అంటూ ఫైర్ అయిన ఫ్రెండ్






