- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బ్యూటీ తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..లైవ్‌లో ఆ పనిచేసినందుకేనా!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నటికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 29న విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కులను వయాకమ్ సంస్థ సొంతం చేసుకుంది. కానీ దీనికి విరుద్ధంగా తమన్నా, లైవ్‌లో స్ట్రీమింగ్ చేసింది. దీంతో హీరోయిన్ చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లిందని, వయాకమ్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,మహారాష్ట్ర సైబల్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో బ్యూటీ తమన్నాను విచారణకు రావాలని కోరింది. అయితే ఈ విషయంపై మరింత దర్యాప్తు చేసేందుకే ఆమెను విచారణకు పిలిచినట్లు పోలీసులు తెలిపారు.ఇక ఇదే కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనను ఈనెల 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయగా, ఆయన గైర్హాజరైనట్లు సమాచారం.తమన్నాకు పోలీసులు నోటీసులు పంపిచడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురి అవుతున్నారు.
- Tags
- Tamannaah Bhatia