మోహన్‌లాల్‌కు సంకెళ్లు వేసిన పోలీసులు.. 'దృశ్యం 3' ఫస్ట్ లుక్

by Naresh N |
మోహన్‌లాల్‌కు సంకెళ్లు వేసిన పోలీసులు.. దృశ్యం 3 ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్ : జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ నటి మీనా హీరో హీరోయిన్‌గా నటించిన 'దృశ్యం' మరియు 'దృశ్యం 2' సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురికి, కుటుంబానికి కష్టం వస్తే.. వాళ్లని కాపాడుకునే క్రమంలో తండ్రి పడే కష్టాలు, బాధలను ఈ రెండు సిరీస్ ల ద్వారా అద్భుతంగా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా తన నటనతో ప్రేక్షక అభిమానుల హృదయాలను దోచుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా 'దృశ్యం 3' రానునట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'దృశ్యం 3: ది కంక్లూజన్' అనే పేరుతో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్‌లో హీరో మోహన్‌లాల్.. సంకెళ్లతో బంధించబడి సరికొత్త ఇంటెన్సివ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ సిరీస్‌లో ఇంకా ఎన్ని ట్విస్టులుండబోతోన్నాయో అని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు.

ఓ అమ్మాయితో కలిసి కారులో ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయా.. నాగచైతన్య

Next Story