- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి సాయం చేయండి అంటూ రోడ్ మీద ఏడుస్తూ బతిమిలాడాను.. దసరా విలన్ ఎమోషనల్ కామెంట్స్
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) తెలుగు చిత్రాల్లోనూ నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు.

దిశ, సినిమా: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) తెలుగు చిత్రాల్లోనూ నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఆయన ‘దసరా’ (Dasara) మూవీలో విలన్‌గా నటించడంతో తన రేంజ్ మారిపోయింది.గత ఏడాది ఆయన తెలుగులో నితిన్ ‘రాబిన్‌హుడ్’(Robinhood)చిత్రంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు.ప్రస్తుతం మలయాళ భాషలో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘‘నేను నా ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో నేను నిద్రపోతున్నా. మా నాన్నతో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నా. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి చూస్తూ మా కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు మేమంతా రోడ్ మీద ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయా. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి ఘటన ఎదుర్కొన్నా. దయచేసి ఎవరైనా సాయం చేయండి మమ్మత్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి అని రోడ్ మీదనే ఏడుస్తూ బతిమిలాడాను’’ అని చెప్పుకొచ్చారు.






