- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి నన్ను క్షమించండి.. ఇక నుంచి అలాంటివి చేయనంటూ నితిన్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(nithin), వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(nithin), వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ఇందులో సప్తమి గౌడ(Sapthami Gowda) హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తు్న్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘ఈ సినిమా హిట్ కావాలని ముగ్గురి కోసం కోరుకుంటున్నాను. మొదట మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’ కోసం రెండేళ్లు చాలా కష్టపడ్డారు. అలాగే నన్ను ఇష్టపడేవాళ్ల కోసం ఈ సినిమా విజయం సాధించాలి. నాకు హిట్ వస్తే ఆనందపడేవాళ్లు, ఫ్లాప్ వస్తే బాధపడేవాళ్ల కోసం ఇది విజయాన్ని పొందాలి. నేను ఇటీవల నటించిన చిత్రాలు మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాయి. దయచేసి నన్ను అందరూ క్షమించండి. ఇక నుంచి మంచి సినిమాలతోనే మీ ముందుకువస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ‘తమ్ముడు’ మూవీ మీ అందరినీ సంతోషపెడుతుందని అనుకుంటున్నాను. మా చిత్రం పూర్తి కావడానికి టీమ్ ఎంతో కష్టపడింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






