దయచేసి కళను చంపొద్దు.. రొమాంటిక్ సీన్స్ తొలగించడంపై టాలీవుడ్ డైరెక్టర్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBSC) హాలీవుడ్ సినిమా ‘సూపర్‌మ్యాన్’(Superman)లో 33 సెకన్ల రొమాంటిక్ సీన్స్‌ను ఇండియన్ వెర్షన్‌లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

దయచేసి కళను చంపొద్దు.. రొమాంటిక్ సీన్స్ తొలగించడంపై టాలీవుడ్ డైరెక్టర్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBSC) హాలీవుడ్ సినిమా ‘సూపర్‌మ్యాన్’(Superman)లో 33 సెకన్ల రొమాంటిక్ సీన్స్‌ను ఇండియన్ వెర్షన్‌లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూవీ టీమ్ తొలగించి ఈమూవీని విడుదల చేసినట్లు సమాచారం. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దీనిపై నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల శ్రేయా ధన్వంతరి ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.

తాజాగా, టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) సెన్సేషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ ఇంటర్‌నెట్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో విలువలు, నేర్పించాలనే పేరుతో సినిమాలను సెన్సార్ చేయడం కాలం చెల్లిన పద్ధతిగా, హస్యాస్పదంగా అనిపిస్తుంది. దయచేసి కళను చంపొద్దు. నైతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఒక తప్పుడు ప్రయత్నం. సమాజానికి కథల నుంచి రక్షణ కావాలన్నట్లుగా ఉంది. ఇది సంస్కృతిని కాపాడడం కాదు. వ్యక్తిగత అహంభావాలను పెంచి పోషించడమే అవుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరం’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story