- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ఆ పని చేయొద్దు.. ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్‌కు మహేష్ బాబు రిక్వెస్ట్.. హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్
మౌళి (Mouli Tanuj Prasanth)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts).

దిశ, సినిమా: మౌళి (Mouli Tanuj Prasanth)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, రాజీవ్ కనకాల, అనిత్, చౌదరి, సత్య కృష్ణన్, కంచి, జై కృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మౌళి సరసన శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి అల్లు అర్జున్, రవితేజ, నాగచైతన్య, నాని, విజయ్ దేవరకొండ, సుమంత్, అడివి శేష్ ప్రశంసలు కురిపించారు.
ఈక్రమంలోనే.. మహేష్ బాబుకు అభిమాని అయిన ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి ఆయన రివ్యూ ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టాడు. నా డెమి గాడ్ మహేష్ బాబు అన్న ఒకసారి మా సినిమాపై ట్వీట్ చేస్తే చాలు. లేకుంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వారం పాటు ఎక్కడికైనా వెళ్లిపోతా. అంతకు మించిన ఆనందం నా జీవితంలో ఉండదు’’ అని అన్నాడు. ఇక ఈ విషయం కాస్త మహేష్ బాబు వరకు వెళ్లడంతో తన అభిమానిని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ‘‘“లిటిల్ హార్ట్స్ సినిమా సరదాగా, కొత్తగా, చాలా బాగుంది. నటీనటులందరూ ఎక్స్ట్రార్డినరీగా నటించారు. ముఖ్యంగా యంగ్ స్టర్స్ చాలా బాగా చేశారు. సెన్సేషనల్ యాక్టింగ్ అని చెప్పారు. ఎంతో జాయ్ ఫుల్ గా ఉంది!!!
సింజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్. నువ్వు కొంతకాలం చాలా బిజీగా మారిపోతావు. రాకింగ్ చేస్తూ ఉండండి. మొత్తం టీంకి నా అభినందనలు’’ అని సూపర్ స్టార్ రాసుకొచ్చారు. ఇక దీనికి సుంజిత్ నేను ఇంక ఎక్కడికి వెళ్లను మహేష్ అన్న అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై హీరోయిన్ శివాని నాగరం స్పందిస్తూ..“ఓ మై గాడ్. సార్… ఇది నాకు చాలా చాలా ప్రత్యేకమైంది. మీ ప్రేమ, బ్లెస్సింగ్స్ కి చాలా ధన్యవాదాలు సార్. నేను ఎల్లప్పుడూ మీకు పెద్ద అభిమానిని. మీ ట్వీట్ నన్ను ఈ వారం మొత్తం ఉత్సాహపరిచింది” అని రీ పోస్ట్ పెట్టింది. tweet






