Rishabh Shetty: దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. అభిమానులకు రిషబ్ శెట్టి కీలక విజ్ఞప్తి

by Mallepaka Hamsa |

రిషబ్ శెట్టి(Rishabh Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Rishabh Shetty: దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. అభిమానులకు రిషబ్ శెట్టి కీలక విజ్ఞప్తి
X

దిశ, సినిమా: రిషబ్ శెట్టి(Rishabh Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. దసరా కానుకగా వచ్చి ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి పలు సినిమాల రికార్డును బ్రేక్ చేసింది. ఇక కేవలం ఆరు రోజుల్లోనే ‘కాంతార: చాప్టర్1’ దాదాపు రూ.427 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరో రెండు రోజుల్లో రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

ఈ క్రమంలో.. తాజాగా, రిషబ్ శెట్టి కీలక విజ్ఞప్తి చేశారు. థియేటర్లలో సినిమా చూసేందుకు కొందరు దైవ వేషధారణలో హాజరవుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన రిషబ్ శెట్టి.. ‘‘దైవ వేషధారణ మన సంప్రదాయంలో పవిత్రమైనది. దానికి ఉన్న ఆధ్యాత్మికత, భక్తిని గౌరవించండి. థియేటర్ వాతావరణంలో దైవ వేషాలతో ప్రవేశించడం సాంప్రదాయాన్ని వక్రీకరించే చర్యగా మారుతుంది. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు. మనం ఈ పుణ్యాన్ని కాపాడుకుందాం. నా విజ్ఞప్తిని అభిమానులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story