- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి అలా పిలవకండి: ఫ్యాన్స్‌కు విజయ్ రిక్వెస్ట్
విలక్షణమైన నటనతో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.

దిశ, సినిమా: విలక్షణమైన నటనతో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. హీరోగా, విలన్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు తమిళంతో పాటు తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న హీరో ఇప్పుడు 'ఫర్జీ' సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. షాహిద్ కపూర్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 10న విడుదలకానుంది.
ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ సమావేశంలో మాట్లాడిన విజయ్ సేతుపతి.. 'కొందరు అభిమానులు పాన్ ఇండియా స్టార్ అంటూ పిలిచారు. కానీ, నేను నటుడిని మాత్రమే. పాన్ ఇండియా స్టార్‌ని కాదు. ఈ స్టేట్మెంట్ నాపై ఒత్తిడిని పెంచుతుంది. నా పేరుకి ఎలాంటి లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను అలా పిలవకండి. నేను అన్ని భాషల చిత్రాలు చేయాలనుకుంటున్నా. బెంగాలీ, గుజరాతీ ఇలా నాకు ఆఫర్ వస్తే అన్ని భాషల్లోనూ నటిస్తా. అంతేకానీ దయచేసి నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి' అని రిక్వెస్ట్ చేశాడు.
Also Read..






