దయచేసి ‘వార్-2’ గురించి వస్తున్న వార్తలను నమ్మకండి.. మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వార్-2’.

దయచేసి ‘వార్-2’ గురించి వస్తున్న వార్తలను నమ్మకండి.. మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వార్-2’. ఈ సినిమా 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ‘వార్-2’ తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు పుల వార్తలు ఊపందుకున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘వార్-2’ ఈవెంట్ గురించి వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. దయచేసి వాటిని నమ్మకండి. ఇప్పటివరకు ఈవెంట్ స్థలం నిర్ణయించలేదు. త్వరలోనే ఈవెంట్ గురించి నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత మేము సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తాము’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న హృతిక్, ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

link

Next Story