దయచేసి తప్పుడు వార్తలను నమ్మొద్దు.. దిల్ రాజు ప్రొడక్షన్స్ కీలక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌లో రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్నాయి.

దయచేసి తప్పుడు వార్తలను నమ్మొద్దు.. దిల్ రాజు ప్రొడక్షన్స్ కీలక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌లో రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా, దిల్ రాజు టీమ్ ఓ కీలక ప్రకటన విడుదల చేసి పుకార్లకు చెక్ పెట్టింది. గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. తాము ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లో ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ అనీస్ బజ్మీ(Anees Bazmee) దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్, నటీనటులు ఎంపిక ఇతర సన్నాహాలు జరగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాము. దయచేసి మా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయవద్దు, తప్పుడు వార్తలను నమ్మొద్దు. దయచేసి ఎవరూ సొంతంగా అంచనాలు వేయడం లేనిపోని వార్తలు షేర్ చేయడం ఆపాలని ప్రేక్షకులను కోరుతున్నామని అన్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేము స్వయంగా మీతో పంచుకుంటాం.

అప్పటి వరకు వేచి ఉండాలంటూ స్పష్టం చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడింది. అలాగే పవన్ అభిమానుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మెసేజ్ తో పాటు ఎంటర్టైనింగ్ గా ఆ చిత్రం ఉంటుందని పవన్ డేట్స్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింద. ఇక దిల్ రాజు టీమ్ ప్రకటనతో ఈ విషయాలు చెప్పకపోవడం పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ లేనట్లేనా అని నిరాశకు గురవుతున్నారు.

Next Story