- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దయచేసి వాళ్లను నమ్మి మోసపోకండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ పోస్ట్
గత కొద్ది రోజులుగా సెలబ్రిటీల పేరుతో మోసాలు జరుగుతున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా సెలబ్రిటీల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. హీరో, హీరోయిన్ల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రీయేట్ చేయడం లేదా వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి అనుభవాలు చాలా మందే ఎదుర్కొన్నారు. తాజాగా, రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు ప్రకటించింది. తన పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తెలుపుతూ అభిమానులకు హెచ్చరించింది. ‘‘ఎవరో నా పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ నంబర్ 8111067586తో ఉన్న అకౌంట్ నుంచి చాలా మందికి మెసేజ్‌లు పంపి మోసం చేయాలని చూస్తున్నారు.
అది నా అకౌంట్ కాదు. దయచేసి దీన్ని అందరూ గుర్తించండి. ఒకవేళ మీకు ఆ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయండి. దయచేసి వాళ్లను నమ్మి మోసపోకండి’’ అని విజ్ఞప్తి చేసింది. కాగా ఇటీవల అదితిరావు హైదరి(Aditi Rao Hydari)కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురవగా.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేయడంతో ఆయన కోర్టు వరకు వెళ్లారు. కీర్తి సురేష్, రష్మిక వంటి స్టార్ హీరోయిన్స్‌ను కేటుగాళ్లు టార్గెట్ చేస్తూ ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. జనాలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.






