దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి.. అభిమానులను హెచ్చరించిన టాలీవుడ్ నటి

by Mallepaka Hamsa |

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో స్కాములు, జరుగుతున్న విషయం తెలిసిందే.

దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి.. అభిమానులను హెచ్చరించిన టాలీవుడ్ నటి
X

దిశ, సినిమా: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో స్కాములు, జరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాను మంచికి ఉపయోగిస్తే.. మరికొందరు చెడుకు వాడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక కొంతమంది కేటుగాళ్ల వల్ల సినీ సెలబ్రిటీలు సైతం చిక్కుల్లో పడుతున్నారు. మరికొందరు మాత్రం తొందరలోనే కనిపెడుతూ అలర్ట్ అవుతూ అందరికీ అవగాహన వచ్చేలా చేస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ నటి ప్రగతి (Pragathi )పేరుతో కొందరు కేటుగాళ్లు స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన పేరును వాడుతూ డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నట్లు ఆమె దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దయచేసి ఇలాంటి వాటి బారిన పడకూడదని తెలిపింది. అందరూ చదువుకున్న వాళ్లే కాబట్టి కొంచెం మైండ్ పెట్టి ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తగా వ్యవహరించాలని చెప్పింది. అయితే పలువురు డబ్బులు పంపిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తూ చాలామంది పంపినప్పటికీ పెద్ద మొత్తంలో ఉండకపోవడంతో సేఫ్ అయినట్లు వెల్లడించింది. అందుకే పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారని తెలిపింది. కాగా.. ప్రగతి గతంలో ఎన్నో చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలకు అత్తగా, తల్లిగా, పిన్నిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తోంది. అలాగే వర్కౌట్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Next Story