- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేణుస్వామి నిజస్వరూపం బట్టబయలు.. పబ్లిక్‌గానే ఆ పని చేస్తూ దొరికిపోయిన జ్యోతిష్యుడు?
వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకం చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సమంత వివాహం సమయంలో వీరు విడిపోతారు అని చెప్పడం, ఆయన చెప్పిన నాలుగు సంవత్సరాల

దిశ, సినిమా : వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకం చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సమంత వివాహం సమయంలో వీరు విడిపోతారు అని చెప్పడం, ఆయన చెప్పిన నాలుగు సంవత్సరాల తర్వాత నాగచైతన్య, సమంత విడిపోవడంతో,ఈయన సెలబ్రిటీ అయిపోయారు. అప్పటి నుంచి ప్రముఖులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. కానీ ఈ మధ్య ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నేను ఇక జాతకాలు చెప్పను అంటూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఏపీ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని ఆయన చెప్పాడు. కానీ కూటమి గెలవడంతో ఆయన జ్యోతిష్యం తప్పు అయిపోవడంతో వేణుస్వామి జాతకం చెప్పను అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పబ్లిక్‌గా ఈయన చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.
పూజలు పునస్కారాలు చేసే వేణు స్వామి సడెన్‌గా బార్‌లో దర్శనం ఇచ్చారు. వీకెండ్ మందు కొట్టేందుకు బార్‌కి వెళ్లాడు. తన మిత్రుడితో కూర్చొని మద్యం సేవించాడు. ఆయన మందుకొడుతున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది వేణుస్వామి అసలు నిజస్వరూపం అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈయన గతంలోనే తనకు మందు అలవాటు ఉందని చెప్పిన విషయం తెలిసిందే.






