- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా అనుమతి లేకుండా నా ఫొటోలు వాడుకుంటారా?.. చర్యలు తీసుకుంటానంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఓ వెబ్‌సైట్ వాళ్లు తనకు తెలియకుండా తన ఫొటోలు వాడుకున్నట్లు తెలుపుతూ వారిని హెచ్చరించింది. ఈ విషయాన్ని తెలుపుతూ నోట్ రిలీజ్ చేసింది. ‘‘నేను ఎక్కువగా ఆన్‌లైన్ షాకింగ్ చేస్తుంటాను. అయితే ఈ మధ్య కొన్ని బ్రాండెడ్ వెబ్‌సైట్స్‌లలో నా ఫొటోలు పెట్టారు. అది చూసి నేను షాకయ్యాను. నన్ను సంప్రదించకుండా, నా అనుమతి లేకుండా, నన్ను రిక్వెస్ట్ చేయకుండా నా పిక్స్ ఎలా ఉపయోగించుకుంటారు. ఇది నేను సహించలేకపోయాను. ఒక నటిగా నేను కొత్త దుస్తులు, అభరణాలు ధరిస్తుంటాను. అలాంటప్పుడు ఆ డ్రెస్ వివరాలు దాని బ్రాండ్‌కు క్రెడిట్ ఇస్తూ పోస్ట్ చేస్తాను.
అలా పోస్ట్‌లో చెప్పినంత మాత్రాన నా ఫొటోలు మీ వెబ్‌సైట్‌కు ఉపయోగించుకుంటారా?. కనీస నైతిక బాధ్యత వహించరా? ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. నేను వివరాలు వెల్లడించక ముందే నా ఫొటోలు తొలగించండి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కాగా.. సోనాక్షి సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘నికితా రాయ్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘జటాధర’ సినిమాలో నటిస్తోంది.
ఇందులో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా నటిస్తుండగా.. సోనాక్షి హీరోయిన్‌గా చేస్తోంది. పౌరాణిక, మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






