- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోల ఇమేజ్ కంటే వారి పనితీరే ముఖ్యం.. స్టార్స్ ప్రవర్తనపై రుక్మిని వసంత్ కామెంట్స్
మొదట్లో యష్ సార్ వంటి వారిని కలిసినప్పుడు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఆయన చేసిన గొప్ప సినిమాల ప్రభావం మనపై ఉంటుంది.

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి తన నటనతో, సహజమైన అందంతో దక్షిణాది ప్రేక్షకులను మాయ చేస్తున్న నటి రుక్మిణి వసంత్. అనతి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ దక్కించుకుంది. ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ, ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈక్రమంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్, స్క్రిప్ట్ ఎంపిక, స్టార్ హీరోలతో పనిచేయడంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. "నేను కేవలం ఒక్క విషయాన్ని చూసి సినిమాను ఓకే చేయను. అది పలు అంశాల కలయిక. మొదట కథ చాలా ఆసక్తికరంగా ఉండాలి. దాంతో పాటు నా పాత్ర ప్రయాణంఎలా ఉంది అనేది నాకు చాలా ముఖ్యం. నేను ఎప్పుడూ కథకు కేంద్రబిందువుగానే ఉండాలని కోరుకోను, ఆ పాత్ర కథను ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ, నా పాత్రకు ఒక ఆరంభం, మాధ్యమం, ముగింపు ఉండాలి. ఆ పాత్రలో ఎంతో కొంత ఎదుగుదల కనిపిస్తే, దానితో పాటు నేను కూడా నటిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది" అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాంతార:చాప్టర్1’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం గురించి మాట్లాడుతూ.. "కాంతార ఒక అద్భుతమైన ఉదాహరణ. కరావళి ప్రాంత సంస్కృతిని ప్రపంచానికి చూపించడం గొప్ప విషయం.
ఆ మైథిక ప్రపంచంలో భాగమవ్వడం, అందులో చిన్న పాత్ర అయినా సరే చేయడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ప్రపంచాన్ని నిర్మించిన విధానం అద్భుతం. అయితే, ఇలాంటి సున్నితమైన సంస్కృతులను, విశ్వాసాలను వెండితెరపై చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక సంస్కృతి మాత్రమే కాదు, ప్రజల నమ్మకం. అందుకే సినిమా ప్రారంభంలోనే ఆ భావోద్వేగాలను గౌరవించాలని మేకర్స్ కోరుతారు" అని రుక్మిణి వివరించారు. రిషబ్ శెట్టి, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్లతో పనిచేయడంపై మాట్లాడుతూ.. "మొదట్లో యష్ సార్ వంటి వారిని కలిసినప్పుడు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఆయన చేసిన గొప్ప సినిమాల ప్రభావం మనపై ఉంటుంది. అలాగే స్టార్ హీరోలు సెట్‌లో చాలా సరళంగా ఉంటారు. తమ ఇమేజ్‌ను తలకెక్కించుకోకుండా, ప్రతి సినిమాను కొత్తగా ప్రారంభిస్తారు. ఎదుటివారికి స్పేస్ ఇస్తూ, అందరి సహకారాన్ని గుర్తిస్తారు. స్టార్ హీరోల ఇమేజ్ కంటే వారి పనితీరే ముఖ్యం. వారి పనితీరును దగ్గరుండి చూడటం ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్" అని రుక్మిణి తెలిపారు. త్వరలో ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది. యష్ హీరోగా.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా, తారా సుతారియా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 4న థియేటర్స్‌లోకి రాబోతుంది.






