మనుషులు మరీ దిగజారిపోతున్నారు నాకు చాలా కోపంగా ఉంది: విజయ్ దేవరకొండ

by Mallepaka Hamsa |

జననాయగన్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఒక మూవీ లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

మనుషులు మరీ దిగజారిపోతున్నారు నాకు చాలా కోపంగా ఉంది: విజయ్ దేవరకొండ
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ విజయ్ చివరి చిత్రంగా వస్తున్న ‘జననాయగన్’ సినిమాకు సంబంధించి జరిగిన లీకేజీ ఉదంతం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. ఈ మూవీలోని ఐదు నిమిషాల నిడివి గల కీలక సన్నివేశంతో పాటు ఒక పాట కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఘటనను ఖండించగా, తాజాగా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందిస్తూ నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయ్ దేవరకొండ, ఈ వార్త విన్నప్పటి నుండి తనకు చాలా కోపంగా ఉందని తెలిపారు. "జననాయగన్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఒక మూవీ లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

కెరీర్ తొలినాళ్లలోనే నేను ఆ చేదు అనుభవాన్ని, నష్టాన్ని చవిచూశాను" అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇతరుల కష్టాన్ని దెబ్బకొట్టడానికి మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారో ఈ ఘటన నిరూపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం ఉంటుందని, కేవలం నటులే కాకుండా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు అందరూ నష్టపోతారని విజయ్ పేర్కొన్నారు. "మనం ఒక లక్ష్యం వైపు వెళ్తుంటే, కావాలని టార్గెట్ చేసి మన ఆశలన్నీ అడియాసలు చేస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. దీని వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోలేకపోతే అది ఖచ్చితంగా వ్యవస్థ వైఫల్యమే అవుతుంది" అని విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న జననాయగన్ చిత్ర బృందానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story