"పెద్ది" సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌...జాన్వీతో అదిరిపోయే సాంగ్ !

by velandi.Saikiran |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్

పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌...జాన్వీతో అదిరిపోయే సాంగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. వచ్చే సంవత్సరం మార్చిలో సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. త్రిష కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కూడా ఉండనున్నారట.

శ‌రావేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. పెద్ది సినిమా ఫస్ట్ అఫ్ మొత్తం పూర్తి చేశారట. ఈ ఫస్ట్ ఆఫ్‌ అవుట్ ఫుట్ కూడా బ్రహ్మాండంగా వచ్చిందని రామ్ చరణ్ ప్రశంసించారని సమాచారం. ఇక రేపటి నుంచి పూణేలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ ఉంటుందట. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సినిమా పాట షూట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు రెహమాన్ అద్భుతమైన టూన్ అందించినట్లు సమాచారం. ఈ పాట జనాలకు బాగా ఎక్కుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్లిక్


Next Story