హాంకాంగ్‌లో ‘పెద్ది’ హంగామా.. గ్లోబల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా పవర్ స్టార్ విధ్వంసం!

by Mallepaka Hamsa |

మ్యాగజైన్ కవర్ ఫోటోలో రామ్ చరణ్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.

హాంకాంగ్‌లో ‘పెద్ది’ హంగామా..  గ్లోబల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా పవర్ స్టార్ విధ్వంసం!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయింది. తాజాగా ఆయన ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై మెరిసి అభిమానులను ఖుషీ చేశారు. భారతీయ సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్‌గా ఎస్క్వైర్ ఇండియా చరణ్‌ను అభివర్ణించింది. ఈ మ్యాగజైన్ కవర్ ఫోటోలో రామ్ చరణ్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. "ప్రస్తుత కాలాన్ని శాసిస్తున్న గ్లోబల్ ఫోర్స్ రామ్ చరణ్. భారతీయ సినిమాకు ఒక నిర్వచనంగా మారిన ఆయన ప్రయాణాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నాం" అంటూ సదరు మ్యాగజైన్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఫోటోషూట్‌లో చరణ్ చాలా రాయల్‌గా, కమాండింగ్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్ కోసం రామ్ చరణ్ హాంకాంగ్‌ వెళ్లినట్లు సమాచారం.

ఇక ఇందులో ఆయన పెట్ డాగ్ రైమ్ నిలిచింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని మరీ చరణ్ ఈ షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. ‘పెద్ది’ సినిమా కోసం చరణ్ పెంచుకున్న హెయిర్ స్టైల్, గడ్డంతోనే ఈ ఫోటోషూట్‌లోనూ మెరిశారు. అంటే, త్వరలో మనం వెండితెరపై చూడబోయే ‘పెద్ది’ లుక్ ఎలా ఉండబోతుందో ఈ మ్యాగజైన్ ఫోటోల ద్వారా ముందే హింట్ దొరికినట్లయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రావడమే ఆలస్యం.. మెగా ఫ్యాన్స్ వీటిని వైరల్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్‌లో చరణ్ ఎదుగుతున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారుతున్న చరణ్ దూకుడు చూస్తుంటే, ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అర్థమవుతోంది.

Next Story