Peddha Kapu 1 Theatrical Trailer : ఆకట్టుకుంటున్న డైలాగ్స్

by Mallepaka Hamsa |   (  Updated:2023-09-12 04:45:26  IST  )

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెద్దకాపు’. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ మూవీలో విరాట్ క‌ర్నా, ప్రగ‌తి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Peddha Kapu 1 Theatrical Trailer :  ఆకట్టుకుంటున్న డైలాగ్స్
X

దిశ, సినిమా: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెద్దకాపు’. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ మూవీలో విరాట్ క‌ర్నా, ప్రగ‌తి హీరోహీరోయిన్లుగా న‌టించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన సినిమా సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఒక ఆడ‌దాని ఉచ్చులో ప‌డి ఆకాశం త‌ప్పా.. ఆదుకునే వాడు లేక‌, అరిస్తే వినిపించుకునే వాడు లేక వెళ్లిపోయాడు’ అంటూ త‌నికెళ్లభ‌ర‌ణి డైలాగ్‌తో మొదలైన ట్రైల‌ర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆకట్టుకుంటుంది. అయితే ట్రైలర్ చివరలో ‘మ‌నిషిలో క‌సి త‌గ్గినా.. క‌నిక‌రం పెరిగినా.. ఆడు మ‌నోడైనా, ప‌రాయి వాడైనా’ అనే డైలాగ్‌తో శ్రీకాంత్ అడ్డాల కూడా కనిపించగా ఆయన ఇందులో ఓ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది.

Next Story