- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఆర్ టీమ్‌కు డబ్బులు ఇస్తే స్టార్లు అయిపోరు.. నేటి హీరోయిన్లపై అమీషా పటేల్ సెన్సేషనల్ పోస్ట్
నేటి తరం హీరోయిన్లు తమను తాము 'సూపర్ స్టార్లు'గా ప్రచారం చేసుకోవడానికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని అమీషా మండిపడ్డారు.

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ, నేటి తరం హీరోయిన్ల తీరుపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పెరిగిపోతున్న 'ఫేక్ పీఆర్' (PR) సంస్కృతిని ఆమె తీవ్రంగా విమర్శించారు. నేటి తరం హీరోయిన్లు తమను తాము 'సూపర్ స్టార్లు'గా ప్రచారం చేసుకోవడానికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని అమీషా మండిపడ్డారు. బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపని వారు కూడా, పీఆర్ టీమ్స్ సహాయంతో తామే నంబర్ వన్, నంబర్ టూ అని కలరింగ్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆమె పేర్కొన్నారు. "మీరు బాధపడినా ఇది చేదు నిజం. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు సూపర్ స్టార్ అని పిలుచుకోండి. అప్పటివరకు ఈ పీఆర్ గేమ్‌లు ఆపండి" అని అమీషా చురకలు అంటించారు.
2026 నాటి పరిస్థితుల ప్రకారం, ఒక సినిమాకు 100 కోట్ల వసూళ్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదని, కనీసం 200 కోట్లు రాబట్టిన ఒక్క సినిమా కూడా కెరీర్‌లో లేని వారు స్టార్లమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. 'కహో నా ప్యార్ హై', 'గదర్', 'గదర్-2' వంటి భారీ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఆ సినిమాలు తనతో నటించిన హీరోల కెరీర్‌లోనే అతిపెద్ద విజయాలుగా నిలిచాయని, అంతటి హిట్లు ఉన్నా తాను ఎప్పుడూ ప్రచారం కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. సొంత టాలెంట్‌తో కాకుండా, కేవలం డబ్బులు ఇచ్చి చేయించుకునే ప్రచారం ఎంతో కాలం నిలవదని అమీషా పటేల్ పరోక్షంగా నేటి హీరోయిన్లకు హెచ్చరిక జారీ చేశారు. నిజమైన స్టార్‌డమ్ అనేది థియేటర్ల వద్ద వసూళ్ల రూపంలో కనిపించాలి తప్ప, సోషల్ మీడియా పోస్టుల్లో కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద చర్చకు దారితీశాయి.






