- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాయల్ రాజ్‌పుత్ విశ్వరూపం.. అంచనాలను పెంచుతున్న ‘లీడర్’ ట్రైలర్ !
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న ‘లీడర్’ చిత్రంలో పాయల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, సినిమా: తన మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన భామ పాయల్ రాజ్ పుత్. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు రూట్ మార్చింది. లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న ‘లీడర్’ చిత్రంలో పాయల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘లీడర్’ ట్రైలర్‌లో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు మేకర్స్. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, చేతిలో గన్ పట్టుకుని శత్రువుల వేట మొదలుపెట్టిన పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా ఆమె కనిపించింది. గన్ గురిపెట్టి శత్రువులను చెండాడుతుంటే.. థియేటర్లలో ఈ సీన్స్‌కి పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. పాయల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక భిన్నమైన, సాహసోపేతమైన పాత్రను ఈ సినిమాలో పోషించినట్లు సమాాచారం. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దురై సెంథిల్ కుమార్ తనదైన శైలిలో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం, వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






