- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాయల్ బర్త్ డే స్పెషల్.. ‘వెంకట లచ్చిమి’ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్(Payal Rajput)

దిశ, సినిమా: ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఈ సారి ‘వెంకటలచ్చిమి’ (venkatalachimmi)గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేడు.. పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు సందర్భంగా.. విషెస్ తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఒక జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడి తీసి చేతికి సంకెళ్లు, మేడలో మంగళసూత్రం ఉంచినట్టు కనిపిస్తుంది. రక్తపు మరకలు, మద్యన భయానక వాతావరణం.. అన్ని కలిసి పోస్టర్‌కి పవర్‌ఫుల్ టచ్‌ను ఇస్తున్నాయి.
ఆమె చేతులుకి సంకెళ్లు ఉండటం, రక్తంతో కూడిన మంగళసూత్రం, చుట్టూ నిశ్శబ్ద భయానికి సూచనగా ఉన్న నేపథ్యం సినిమాపై ఉత్కంఠను పెంచుతూ, సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. పోస్టర్ చూస్తేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ముని (Muni)తెరకెక్కిస్తుండగా.. రాజా,పవన్ బండ్రేడ్డి నిర్మిస్తున్నారు.
ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత పాయల్‌ను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో తెరకెక్కించబోతుంది.






