హరీష్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను పవన్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో).. పాపం అంత టార్చర్ పెట్టాడా?

by Disha Web Desk 6 |
హరీష్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను పవన్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో).. పాపం అంత టార్చర్ పెట్టాడా?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో సినిమాలన్నింటికీ బ్రేక్ ఇచ్చి అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. అయితే పవన్ కల్యాణ్ ఇంతకు ముందే మూడు సినిమాలను ప్రకటించిన. విషయం తెలిసిందే. కానీ ఇందులో ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. అలా అప్డేట్స్ కూడా విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు.

ఈ క్రమంలో పవన్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులోని డైలాగ్స్ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ కంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా, ఆ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో జనసేన మీటింగ్‌లో పవన్ రివీల్ చేశాడు.

షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్‌ను ఆ డైలాగ్ ఎందుకు రాసావని అడిగా దానికి అతను.. అందరూ మీరు ఓడిపోయారు అంటే నేను ఒక్కటే చెప్పాను. గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్ది పదునెక్కుతుందని. మీకు తెలియదు మాలాంటి ఫ్యాన్స్ మీ నుండి ఇలాంటివి కోరుకుంటారు అందుకే రాశాను అన్నాడు. అప్పుడు నేను నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం లేదని వాదించాను. కానీ హరీష్ శంకర్ పదే పదే నన్ను అడగడంతో ఆయన బాధ భరించలేక చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ హరీష్ శంకర్ ఆ డైలాగ్ కోసం పవన్‌ను అంత టార్చర్ చేశాడా? అని అంటున్నారు.

Next Story

Most Viewed