ఇన్‌స్టా‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య.. మొదటి పోస్ట్‌తోనే నెటిజన్లను ఫిదా చేసేసిందిగా!

by Mallepaka Hamsa |

ఇది ఎప్పటి నుంచో జరగాల్సిన విషయం.. ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది.

ఇన్‌స్టా‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భార్య.. మొదటి పోస్ట్‌తోనే నెటిజన్లను ఫిదా చేసేసిందిగా!
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఎట్టకేలకు సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడని ఆమె, ఇప్పుడు నేరుగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవడం మెగా అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ‘అన్నా కొణిదెల’ (Anna Konidela) పేరుతో ఖాతా ఓపెన్ చేశారు. అన్నా లెజినోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మొదటి పోస్ట్‌గా తన భర్త పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన మెగా ఫ్యాన్స్ 'వదినమ్మకు సాదర స్వాగతం' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసిన 10 నిమిషాల్లోనే 21 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టారు.

దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ సతీమణికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ వెల్‌కమ్ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పోస్ట్‌కు "ఇది ఎప్పటి నుంచో జరగాల్సిన విషయం.. ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు, నా భర్త పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈ ఖాతాను ప్రారంభిస్తున్నాను" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యుల మద్దతుతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో, అన్నా లెజినోవా ఇలా సోషల్ మీడియాలోకి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Next Story