OG: పవన్ కల్యాణ్ నట విశ్వరూపం.. ‘OG’ ట్రైలర్ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-08 15:44:47  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా(OG Movie) ట్రైలర్ విడుదలైంది.

OG: పవన్ కల్యాణ్ నట విశ్వరూపం.. ‘OG’ ట్రైలర్ విడుదల
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా(OG Movie) ట్రైలర్ విడుదలైంది. ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ అనే లిరిక్ లాగే.. ట్రైలర్‌లో పవన్ నట విశ్వరూపం చూపించారు. తన అభిమాన హీరోను ఎలా చూపించాలని అనుకున్నాడో అచ్చం అలాగే చూపించాడు సుజిత్. ఇక తమన్ మ్యూజిక్ స్పెషల్ హైలైట్‌గా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ ట్రైలర్(OG Trailer) సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేసింది. ఇక ఇందులో బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈ సారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయని స్టార్ట్ అయిన ట్రైలర్ భారీ యాక్షన్ సీన్స్‌తో అంచనాలను రెట్టింపు చేసింది. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మీ లుక్ అదిరిపోయింది.

ఈక్రమంలోనే గ్యాంగ్‌వార్స్‌ను ఆపడానికి.. పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తారు. విలన్స్‌ను వెతికి వెంటాడి చంపుతూ బెంగాల్ టైగలర్‌గా అందరికీ గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక ఈ ట్రైలర్ లేట్ చేయడంపై మూవీ మేకర్స్ స్పందిస్తూ.. ‘‘మేము లేటుగా రావచ్చు. కానీ ఎల్లప్పుడు మేము బ్లాస్టర్ అందిస్తాం. దీనికి మినహాయింపు లేదు. చింతించాల్సిన అవసరం లేదు.. తగలెట్టేయడమే.. ఆలస్యమైనా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడమే అవసరం మా ప్రధాన ప్రాధాన్యత’’ అని రాసుకొచ్చారు.

కాగా.. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ' సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి కె చంద్రన్ & మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Click For Video..

Next Story