పవన్ కళ్యాణ్ ఊచకోత.. 'OG' ఫస్ట్ డే కలెక్షన్లపై అధికారిక ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-26 13:04:54  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘ఓజీ’ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

పవన్ కళ్యాణ్ ఊచకోత.. OG ఫస్ట్ డే కలెక్షన్లపై అధికారిక ప్రకటన
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘ఓజీ’ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి షో నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ షోలతో కొనసాగుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ‘ఓజీ’ (og)థియేటర్స్ వద్ద సృష్టిస్తున్న హవా అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది.

తాజాగా, ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రివీల్ చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టాను. బాక్సాఫీసు వద్ద పవన్ కళ్యాణ్ ఊచకోత సృష్టించారు. ఈ మూవీకి ఒక్క రోజులోనే వరల్డ్ వైడ్‌గా రూ. 154కోట్లు రాబట్టినట్లు పవన్ కత్తి పట్టుకుని కూర్చున పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా చరిత్ర తిరగరాస్తుంది అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో వచ్చింది. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహనన్ (Priyanka Mohanan)హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించగా..శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీని డీవీవీ బ్యానర్‌పై నిర్మించారు. భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లో దూసుకుపోతుంది.

లింక్

Next Story