- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి అలాంటివి చేయొద్దంటూ పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి.. ప్రకాష్ రాజ్‌తో వివాదంపై ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(OG).

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(OG). ఇందులో ప్రియాంక మోహనన్(Priyanka Mohanan)హీరోయిన్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదలై ఘన విజయం సాధించింది. మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు ‘ఓజీ’ రూ.265కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘ఓజీలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు మీకేమైనా ఇబ్బందిగా ఉందా అని ప్రొడక్షన్ వాళ్లు అన్నారు. నాకు అస్సలు ఎవరితో ఇబ్బంది ఉండదు. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నేను ఏదైనా విషయాన్ని చెప్పేస్తాను. ఒక్కోసారి పర్సనల్‌గా ఇష్యూస్ అవుతాయి. నేను ఇచ్చే గౌరవం ఇవ్వడానికి కారణం నాకు అన్నం పెట్టింది సినిమానే. నేను ప్రకాష్ రాజ్ ఉంటే ఇబ్బంది లేదు కానీ.. అలాంటివి ఇక్కడ పెట్టొద్దని చెప్పండి అని అన్నాను. నేను ఫ్రొఫెషనల్‌గా ఉంటాను. ప్రకాష్ రాజ్ గారు అద్భుతమైన నటుడు. ఇష్యూస్ వచ్చాయి.. అవన్నీ వేరే ఫ్లాట్‌ఫామ్‌లో మాట్లాడుకుందాం.
ఆయనకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరి హీరోల అభిమానులకి నేను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నా అభిమానులకు కూడా ఇది వర్తిస్తుంది. ఫ్యాన్స్ వార్‌తో సినిమాను చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది.. ఒకప్పుడు 100రోజులు 150 రోజులు ఆడేవి.. ఇప్పుడు 6రోజులే అయిపోతుంది. సినిమాలాగే చూడండి.. అంతేకానీ అలా ఉండకూడదు.. ఇలా చేయకూడదని తిట్టుకుంటూ ఉంటే బాలేదు. అది సినిమాపై ఎఫెక్ట్ పడుతోంది. దయచేసి ఫ్యాన్ వార్స్ ఆపేసేయండి’’ అని చెప్పుకొచ్చారు.






