ఆ లిస్టులో పవన్ కల్యాణ్ ఉన్నారా?.. ‘హరి హర వీరమల్లు’పై పెరుగుతున్న ఇంట్రెస్ట్

by Disha Web Desk 10 |
ఆ లిస్టులో పవన్ కల్యాణ్ ఉన్నారా?.. ‘హరి హర వీరమల్లు’పై పెరుగుతున్న ఇంట్రెస్ట్
X

దిశ, సినిమా: తాజాగా తెరకెక్కుతున్న టాలీవుడ్ భారీ సినిమాలన్నీ రెండు భాగాలుగా రిలీజ్ అవుతూ సక్సెస్ అందుకుంటున్నాయి. ఇప్పటి వరకు అలా వచ్చిన వాటిలో కేజీఎఫ్, పుష్ప 2 ఎలాంటి విజయం అందుకున్నాయో చూశాం. ఇక ప్రభాస్ ‘సలార్’ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ లిస్ట్‌లోకి పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ కూడా చేరనున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న పవన్, లైనప్ చేసిన సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రాంభమైనప్పటికీ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది హిస్టారికల్ మూవీ కావడంతో కథ చాలా పెద్దగా ఉంది. కాబట్టి రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడి పోతున్నారు.



Next Story

Most Viewed