ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పవన్ కల్యాణ్.. గూస్‌బంప్స్ పక్కా! (వీడియో)

by Disha Web Desk 2 |
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పవన్ కల్యాణ్.. గూస్‌బంప్స్ పక్కా! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లోకి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రికార్డులను తిరగరాశాడు. ఒక్క పోస్టు కూడా పెట్టకుండానే దాదాపు 2.4 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకొని చరిత్ర సృష్టించారు. అయితే, మొదటి పోస్టు ఏం పెడుతారా? అని ఎదురుచూస్తున్న అభిమానులు, నెటిజన్లకు పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం (జులై 15) మొదటి పోస్టు పెట్టేశారు. ‘మన బంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి. మరెన్నో మధురమైన జ్ఙాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులను కలిసిన ఫొటోలను షేర్ చేశారు.

అందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో తనను కలిసిన అందరూ హీరోల ఫొటోలను షేర్ చేశారు. ‘దీంతో నీలాంటి మంచి మనసున్న హీరోకు అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము అన్నా’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ‘నీ సినిమా మాకు వినోదం.. రాజకీయం మాకు బాధ్యత.. నెక్ట్స్ ఏపీ సీఎం నువ్వే’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed