- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్కకి తప్పుకొండమ్మా.. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ సినిమా..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh)విడుదల కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లతో పాటు తన కొత్త ప్రాజెక్టుపై కూడా పవన్ దృష్టి పెట్టడంతో మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి నెలలోనే పవన్ కళ్యాణ్ మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారట. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ మొదటిసారి చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను మార్చి 19న ఉగాది సందర్భంగా గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారని టాక్. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. ఈ సినిమా షెడ్యూల్స్ విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాలకు ఆటంకం కలగకుండా, వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా (2027)జనవరి 12న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సురేందర్ రెడ్డి, పవన్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.






