నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన Pawan Kalyan ఫ్యాన్స్..

by Disha Web Desk 7 |
నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన Pawan Kalyan ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కాగా తాజాగా ఈ నెల 2వ తేదీన పవన్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పవన్ సేవా సంస్థ ద్వారా కొంతమంది అభిమానులు శ్రీకాకుళం జిల్లా మండస మండలానికి చెందిన ఓ మహిళకు రూ. 2.10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించారు. ‘పవన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ మహిళ కుటుంబ కష్టాలు తెలిసి సాయం చేయాలనే ఆలోచనతో ఇల్లు కట్టించాము’ అని అభిమానులు తెలిపారు. ఇక పవన్ సేవా సమితి ద్వారా సహాయం పొందిన ఆ మహిళ పేరు సంతోషి. కాగా రెండేళ్ల క్రితం తన భర్త చనిపోవడంతో.. ఇల్లు లేక ఇద్దరు కూతుళ్లతో ఇబ్బందులు పడుతుంది. వారు కష్టాలని గమనించిన అభిమానులు ఇల్లు కట్టించడంతో సంతోషం వ్యక్తం చేసింది సంతోషి.

P ‘Hari Hara Veera Mallu’ పై Pawan Kalyan కు ఇన్‌ట్రెస్ట్ లేదు..! క్లారిటీ ఇచ్చిన మూవీ నిర్మాత



Next Story

Most Viewed