డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కల్యాణ్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘OG’ అలా ఉండాలంటూ..!

by Disha Web Desk 2 |
డైరెక్టర్ సుజిత్‌కు పవన్ కల్యాణ్స్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ‘OG’ అలా ఉండాలంటూ..!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న ఓ గ్రూప్ ఫొటోను షేర్ చేసింది.

ఇక, ఇంత త్వరగా సగం షూటింగ్‌ పూర్తి కావడం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. పవన్ స్పీడుకు అంతా షాక్ అవుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు ఎడిటింగ్ చేసిన అభిమానులు డైరెక్టర్ సుజిత్‌కు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘ఎలివేషన్ సీన్లు ఎలా ఉండాలి అంటే.. టాలీవుడ్‌లో కేజీఎఫ్‌ కి బదులు ఓజీ రిఫరెన్సులు తీసుకోవాలి’’ అని సూచిస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ సుజిత్‌ను కలిపి ఫొటో ఎడిటింగ్ చేసిన ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు. అది కాస్త ట్రెండ్ అయింది.



Read more : Power Star Pawan Kalyan OG Update : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Next Story

Most Viewed