Power Star Pawan Kalyan OG Update : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

by Disha Web Desk 2 |
Power Star Pawan Kalyan OG Update : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ఓజీ (OG) ఒకటి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముంబై గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుజీత్ శరవేగంగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే యాభై శాతం షూటింగ్ సైతం పూర్తిచేసేశాడు. ఈ విష‌యాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సోమ‌వారం ట్విట్టర్ ద్వారా ప్రక‌టించింది. సినిమా యూనిట్ ఫొటోను నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది. సోమ‌వారం(జూన్ 26)తో ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయిన‌ట్లు తెలిపింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు.

Click here for Twitter post From DVV Entertainment

Read more : ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్.. Pawan Kalyan ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed