‘ఆ ఒక్క మాట అని ఉంటే.. పవన్ కళ్యాణ్‌కు జైలు శిక్ష పడేది’ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్

by Disha Web Desk 10 |
‘ఆ ఒక్క మాట అని ఉంటే.. పవన్ కళ్యాణ్‌కు జైలు శిక్ష పడేది’ రేణు దేశాయ్ వైరల్ పోస్ట్
X

దిశ, సినిమా: రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని దాదాపు పదేళ్లు గడుస్తోంది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పటి వరకు బయట పడలేదు. కానీ పిల్లల కోసం పేరెంట్స్‌గా కొనసాగుతున్నారు. పవన్ కూడా వీలున్నప్పుడుల్లా తన పిల్లలతో గడుపుతుంటాడు. అయితే చాలా మంది అంత మంచి ఫ్యామిలీని మిస్ చేసుకున్నదంటూ రేణు దేశాయ్‌ను రకరకాల మాటలు అన్నారు. తనపై వచ్చిన విమర్శలను ఆమె ఖండిస్తూ వచ్చిందే తప్ప.. అసలేం జరిగిందనే విషయమై ఎన్నడూ నోరు విప్పలేదు. అయితే రీసెంట్‌గా రేణు దేశాయ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి తన గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన వీడియోను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో కృష్ణ కుమారి పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

‘‘హీరో హీరోయిన్లు.. విడిపోయినప్పుడు ఎక్కువ ట్రోలింగ్‌కి గురయ్యేది హీరోయినే. మహిళలు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే కోణంలో సమాజం ఆలోచిస్తుంది. ఈ కారణంగా మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రేణు దేశాయ్ విషయమే తీసుకోండి.. ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రాగానే ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘పెళ్లి ఎలా చేసుకుంటావు.. నువ్వు మా వదినవి’ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఒక బిడ్డను కనేందుకు కూడా అంగీకరించింది. అలాంటి ఆమెను వదులుకునే అవకాశమే రాకూడదు. ఎందుకంటే ఆమె పవన్ కళ్యాణ్‌కి అన్ని విధాలుగా సహకరించింది. ఒకవేళ ఆమె తనకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు. ఏ గుడిలోనో, ఇంకెక్కడో పవన్ కళ్యాణ్ తనను పెళ్లి చేసుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. పవన్‌కు జైలు శిక్ష పడేది కదా.. కానీ అలా అనకుండా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌ని కాపాడింది’’ అంటూ కృష్ణ కుమారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read more: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెల్..!

చిరంజీవి నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా?



Next Story

Most Viewed