పవర్ స్టార్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే?

by Disha Web Desk 2 |
పవర్ స్టార్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రికార్డ్స్ సెట్ చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అసలుసిసలైన మాస్ మసాలా ఎంటర్‌టైన్మెంట్‌ను ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. ఈ మధ్య ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దాదాపు రెండేళ్లుగా అప్‌‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మే 11న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి గ్లింప్స్ ఇచ్చేందుకు ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినట్లు టాక్ కాగా.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి:

ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసిమరీ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్..?


Next Story