Pawan Kalyan : వల్ల నా కెరీర్ నాశనమైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
Pawan Kalyan : వల్ల నా కెరీర్ నాశనమైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, కమెడియన్‌గా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్న ఆయన ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ హైలెట్ అవుతారు. పోసాని ప్రస్తుతం పాలిటిక్స్‌లో కొనసాగిస్తున్నాడు. వైఎస్‌ఆర్‌సీపీకి సపోర్ట్‌గా ఉంటూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటాడు. గతంలో ఈయన మెగా కుటుంబం గురించి కూడా సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా ఈ కమెడియన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పవన్‌పై ఎక్కడ లేని ప్రేమ వలకబోశారు. ‘‘నిజం చెప్పాలంటే చిరంజీవి, చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాన్ చాలా బెట్టర్. సినిమాల్లో అవకాశాల కోసం మాత్రమే ఇప్పుడు అతడ్ని పొగడడం లేదు. ఆయనను పొగడడానికి కూడా కారణం ఏమి లేదు.’’ అంటూ పోశాని వెల్లడించారు. గతంలో మీరు మెగా ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యల వల్ల మీ కెరీర్‌పై ఏమైనా ఎఫెక్ట్ చూపాయా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అవును నా కెరీర్‌పై ఎఫెక్ట్’’ అయ్యిందని బదులిచ్చారు. పవన్ వల్ల నా కెరీర్ నాశనమైందనే విషయం పక్కన పెడితే ఆయన చాలా మంచివారని తెలిపారు.’ పవన్ చంద్రబాబుతో చేరి రాజకీయాలు చేయడం అవసరమా అన్న విధంగా పోసాని మాట్లాడాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోశాని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed