పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా.. ‘OG’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

by Disha Web Desk 7 |
పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా.. ‘OG’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలు కూడా చేస్తున్నారు. వాటిలో ‘OG’ ఒకటి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీని యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమిళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఆకట్టుకోనున్నాడు. ఇక ఈ మూవీతో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు తమన్. తమన్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో వపన్ కల్యాణ్ వైట్ షర్ట్ ధరించి కత్తితో విలన్లను నరుకుతున్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించేవిధంగా ఉంది.





Next Story

Most Viewed