- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో పవన్ కల్యాణ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయమా!
సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2' గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2' గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మొదటి భాగంలో శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో అంతకు మించిన స్టార్ పవర్‌ను చూపించాలని నెల్సన్ ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం, 'జైలర్ 2'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక పవర్‌ఫుల్ కెమియో రోల్ (అతిథి పాత్ర) చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నెల్సన్ స్వయంగా పవన్ కల్యాణ్‌ను కలిసి ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారని, దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించారని టాక్ వినిపిస్తోంది.
తమిళ మీడియాలో హల్చల్..
జైలర్-2లో షారుఖ్ ఖాన్ నటిస్తారని ముందుగా వార్తలు వచ్చినా, ఇప్పుడు ఆ స్థానంలో పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఒకే ఫ్రేమ్‌లో తలైవా - పవర్ స్టార్‌లను చూడటం ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన జైలర్-2 కోసం సమయం కేటాయించగలరా అనేది మిస్టరీగా మారింది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ మాత్రమే. పవన్ కల్యాణ్ సన్నిహిత వర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి షారుఖ్ ఖాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు రావడం వల్ల, ఆ బజ్ క్రియేట్ చేయడానికి పవన్ పేరును తెరపైకి తెచ్చి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఏదేమైనా, నెల్సన్ దిలీప్ కుమార్ గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. ఒకవేళ పొరపాటున పవన్ గనుక ఈ ప్రాజెక్టులో ఉంటే, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.






