Pawan Kalyan : నిర్మాతలకు తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్..

by Chukka Sudharani |   (  Updated:2023-07-18 10:57:17  IST  )

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినప్పటికీ.. తన ఫోకస్ మొత్తం రాజకీయంపైనే ఉంది.

Pawan Kalyan : నిర్మాతలకు తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్..
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినప్పటికీ.. తన ఫోకస్ మొత్తం రాజకీయంపైనే ఉంది. వారాహి యాత్రలో భాగంగా బిజీగా ఉండటంతో పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో నిర్మాతలకు పెద్ద తలనొప్పి తయారైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ.. ఇందులో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది ఏపీలో ఎలక్షన్స్ జరగనుండగా సినిమాల సంగతి పక్కన పెట్టి రాజకీయాలలో ఫుల్ యాక్టివ్‌గా మారిపోయారు పవన్ కళ్యాణ్. దీంతో దర్శకులు, నిర్మాతలు తలపట్టుకుంటున్నారు. ఎలా చూసుకున్నా పవన్ నుంచి డేట్స్‌ దొరకాలంటే ఇంకా రెండేళ్లు పట్టేలా ఉంది.

ఇవి కూడా చదవండి: సీఎం ఛాన్స్ లేనట్టే.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

Next Story