సీఎం ఛాన్స్ లేనట్టే.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

by Kodari Anjali |   (  Updated:2023-07-19 16:26:22  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

సీఎం ఛాన్స్ లేనట్టే.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక పవన్ సీఎంగా పోటీ చేస్తున్న సంగతి చేసిందే. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ పవన్‌ను సీఎంగా చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే ఈయన తాజాగా ఎన్డీఏ సమావేశం కోసం దిల్లీకి వెళ్లారు. పవన్‌ను, బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తే సీఎం మీరే అవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనేదే నా ఉద్దేశ్యం.గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను బట్టి, బలాబలాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు.. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ విధంగా హింట్ ఇస్తున్నాడని, సీఎం పదవిపై ఆయనకు క్లారిటీ ఉంది. ఆ పార్టీ కార్యకర్తలకే ఇంకా క్లారిటీ రావట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: Pawan Kalyan : నిర్మాతలకు తలనొప్పిగా మారిన పవన్ కళ్యాణ్..

Next Story