పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసా?

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆయనకున్న ఫాలోయింగ్‌ మరే హీరోకు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ప్లాప్ సినిమా కూడా మినిమం కలెక్షన్లు సాధిస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అంతటి ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కిస్తున్నారు. కరోనాకు ముందే ప్రారంభమైన ఈ చిత్రం వరుస సమస్యలతో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, మళ్లీ పాలిటిక్స్ పూర్తి స్థాయిలో యాక్టీవ్ కావాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత మూడ్రోజులుగా 'హరిహర వీరమల్లు' చిత్ర బృందం ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్‌షాప్‌లో పవర్ స్టార్ మూడ్రోజులూ పాల్గొన్నారు. రోజుకో లుక్‌లో దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. స్వల్ప గడ్డంతో ఉన్న పవర్ స్టార్ లుక్‌ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. దీంతో ఈ లుక్‌లో ఒక ఫుల్ లెన్త్ సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. గత మూడ్రోజులుగా ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ ఫొటోలు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed