First glimpse of Pawan Kalyan at Unstoppable with NBK S2: పవర్ స్ట్రోమ్ లోడింగ్!

by Vinod kumar |   (  Updated:2023-01-16 10:55:19  IST  )

బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్ సక్సెస్‌గా నిలిచింది. మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.

First glimpse of Pawan Kalyan at Unstoppable with NBK S2: పవర్ స్ట్రోమ్ లోడింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సూపర్ సక్సెస్‌గా నిలిచింది. మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ఆహా ఈ మెగా ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తీసుకువచ్చి సంచలనం సృష్టించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రెండో సీజన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి సినీ, రాజకీయ నాయకులోని పాపులర్ స్టార్స్‌ని షోకి తీసుకురావడం, ఆడియన్స్‌కి తెలియని ఎన్నో విషయాలని బాలయ్య బయటపెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజాధారణ పొందింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుండడం, బాలయ్య కూడా పవన్‌కి సినీ, రాజకీయ పరంగా ప్రత్యర్థి కావడంతో ఈ షోపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్‌ని గ్రాండ్‌గా చేశారు. 'అన్‌స్టాపబుల్‌‌లో పవర్ స్టార్ మానియా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పవర్ స్ట్రోమ్ లోడింగ్' అంటూ.. ఒక ఒక చిన్న ప్రోమో విడుదల చేసింది. అయితే ఈ ప్రోమోలో ఎపిసోడ్‌కి సంబంధించిన విజువల్స్ ఏమి చూపించలేదు. కాగా ఈ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి బాలకృష్ణ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. పవన్‌తో పాటు ఈ ఎపిసోడ్‌లో త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొనున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినట్లు తెలుస్తుంది.

Read more:

భారీ వసూళ్లు రాబడుతున్న 'వీర సింహారెడ్డి'!

Next Story