- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నడ హీరోలకు సారీ చెప్పిన పవన్ కల్యాణ్
కన్నడ ఇండస్ట్రీ రాబోతున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జ’.

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీ రాబోతున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జ’. సూపర్ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కలిసి నటించిన సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలిచారట. కానీ, ఆయన రాలేదు. అందుకుగాను హీరో ఉపేంద్రకు పవన్ ఒక లేఖ రాశారు.
‘‘కబ్జ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఉపేంద్రగారు నన్ను ఆహ్వానించారు. చివరి నిమిషం వరకు వచ్చే ప్రయత్నం చేశాను. కానీ, నా షూటింగ్ సమయం పొడిగించినందుకు రాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. రానందుకు నేను చింతిస్తున్నా. ఉపేంద్ర, సుదీప్ నాకు కావాల్సిన మిత్రులు. అలాంటిది ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ ‘కబ్జ’ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






