పవన్ బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్.. మెగా అభిమానులకు పూనకాలే

by Disha Web Desk 7 |
పవన్ బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్.. మెగా అభిమానులకు పూనకాలే
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘‘భస్మాసురుడు అనే ఒకడు ఉండేవాడు తెలుసా.. ఈ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవడికి ఛాన్స్ ఇవ్వడు’’ అంటూ పవన్ కల్యాణ్ వాయిస్‌తో సార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో సాయి తేజ్ బిజీ లైఫ్.. పవన్ కల్యాణ్ ఎంట్రీ చూస్తే నిజంగా పూనకాలు రావాల్సిందే. ఇక ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంటే మరి సినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story