అంచనాలకు మించిన Pawan Kalyan ‘BRO’ ఫస్ట్ డే క‌లెక్షన్స్

by Disha Web Desk 10 |
అంచనాలకు మించిన Pawan Kalyan ‘BRO’ ఫస్ట్ డే  క‌లెక్షన్స్
X

దిశ, సినిమా: మెగా హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్‌తేజ్ కలిసి న‌టించిన తాజా చిత్రం ‘బ్రో’. ద‌ర్శకుడు స‌ముద్రఖ‌ని తెర‌కెక్కించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్ విష‌యంలో కొన్ని విమ‌ర్శలు వినిపించినా, వింటేజ్ లుక్‌లో స్టైలిష్‌గా క‌నిపించాడు ప‌వ‌న్‌. త‌న మునుపటి మేన‌రిజ‌మ్స్‌, యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక కలెక్షన్‌ల విషయానికి వస్తే మొదటి రోజే ఈ మూవీ రూ. 30 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లను రాబ‌ట్టింది. అయితే మూవీ టీమ్ వ‌ర్షాల కార‌ణంగా తొలిరోజు కలెక్షన్ రూ. 20 నుంచి రూ. 22 కోట్ల వరకు మాత్రమే రాబడుతుందని అంచనా వేసింది. కానీ దీనిని అధిగ‌మిస్తూ రూ. 30 కోట్ల వ‌ర‌కు క‌లెక్షన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: తప్పు తెలుసుకుని ట్వీట్ మార్చేసిన ‘BRO’ బ్యూటీ..


Next Story